చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేట గ్రామ సచివాలయం ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. కార్యాలయంలో వీఆర్వో అందుబాటులో లేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గ్రామంలోని కొంతమంది మహిళలు, వృద్ధులకు ఆధార్ కార్డు లేకపోవటంతో సంక్షేమ పథకాలు అందటం లేదని వాపోతున్నారు. ఆందోళన చేస్తున్న మహిళలతో స్థానిక ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి మాట్లాడారు.
ఏ.రంగంపేట గ్రామ సచివాలయం ఎదుట మహిళల నిరసన - Women protest news
చంద్రగిరి మండలం ఏ.రంగంపేట గ్రామ సచివాలయం ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. ఏడాదిగా వీఆర్వో అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామంలోని 82 మహిళలు, వృద్ధులకు ఆధార్ కార్డులు లేవని ఎంపీటీసీ చెప్పారు. దీంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు వారు అందుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదన్నారు. దీనిపై చంద్రగిరి ఎమ్మార్వోకు ఫిర్యాదు చేయగా.. ఆర్.మోహన్ రెడ్డితో ఎంక్వైరీ చేపట్టారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. మహిళల దగ్గర ఫిర్యాదులు స్వీకరించి.. సంబంధిత అధికారులకు అందజేస్తామని మోహన్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: దొరకని రూపేష్ జాడ... న్యాయం కోసం బాధితుల ఆందోళన