ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూలమొక్కల సాగు.. వారికి తెచ్చెను లాభాలు.. - పెనుమూరులో మహిళా రైతులపై కథనం

పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నారు ఆ మహిళా రైతులు. పూలమొక్కల సాగుతో లాభాలు గడించడమే కాదు.. కరవు కాలంలోనూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. చామంతి, బంతిపూల నారుమళ్ల సాగులో మెళకువలు నేర్చుకుని మంచి ఉపాధి పొందుతున్నారు. నాణ్యమైన విత్తన మొక్కలను పెంచుతూ, తోటి రైతులకు సాయపడుతున్న మహిళలపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం.

women farmers victory in penumuru chittore district
పూలమొక్కల సాగు.. వారికి ఇచ్చెను లాభాల బాగు

By

Published : Nov 19, 2020, 12:07 PM IST

Updated : Nov 19, 2020, 7:07 PM IST

పూలమొక్కల సాగు.. వారికి తెచ్చెను లాభాలు..

సీజన్​లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఉన్న చోటునే ఉంటూ ఉపాధి పొందుతున్నారు.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని మహిళలు. షేడ్​నెట్, పాలిహౌస్ లాంటి ఆధునిక పద్ధతులతో చామంతి, బంతిపూల సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. దాంతోపాటు నాణ్యమైన విత్తన మొక్కల నర్సరీలను పెంచుతూ మెరుగైన ఆదాయం ఆర్జిస్తున్నారు. మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు.

మండలంలోని గాంధీపురం, గంధపొడివారిపల్లె, రాచరంగయ్యపల్లె, రాజాఇండ్లు, గోపాలపురం, గొబ్బిళ్లమిట్ట గ్రామాల్లోని మహిళలు పూలమొక్కల సాగుతో నిరంతర ఆదాయం పొందుతున్నారు. పూలసాగు, నర్సరీ మొక్కల పెంపకంతో లాభాలు ఆర్జిస్తున్నారు. స్థానిక వాతావరణానికి తగ్గట్లు అధిక దిగుబడులు ఇచ్చే ఆరేడు రకాల పూలమొక్కలు సాగు చేస్తున్నారు. వీటిని పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మొక్కలను కత్తిరించి అంటు కట్టడం, ట్రేలలో కోకోపిట్ నింపడం, కలుపు తీయండ వంటి పనులతో మరికొంతమందికి ఉపాధినిస్తున్నారు.

సాధారణంగా కొన్ని సీజన్లలో మాత్రమే వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉంటాయి. పంటల్లోనూ నిర్దిష్ట సమయానికే డబ్బు వస్తుంది. అయితే ఈ పూలమొక్కల సాగుతో ఏడాది పొడవునా ఆదాయం ఆర్జిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ మహిళామణులు.

ఇవీ చదవండి..

పోలీసులను లక్ష్యంగా చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు

Last Updated : Nov 19, 2020, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details