చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చింది. నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. గుర్తు తెలియని మహిళ మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం - Srikalahasti latest news
నివర్ తుపాన్ ప్రభావంతో నదులు, చెరువులు, వాగులు, వంకలు నిండి పొర్లుతున్నాయి. అయితే కరవు ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలకు ప్రజల ఆనందానికి హద్దుల్లేవు. సరాదా కోసం నదులను, సెలయేళ్లను చూడటానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోతున్నారు. ఇలా కొట్టుకువచ్చిన మృతదేహాలు ఏ గ్రామాలకు చేరుతున్నాయో తెలియటం లేదు. ఇలాంటి ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. స్వర్ణముఖిలో నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. ఇంతకు ఆ మహిళ ఎవరనేది తెలియటం లేదు.
స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం