ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మామిడి తోటలో మహిళ మృతదేహం లభ్యం - చిత్తూరు జిల్లా తాజా క్రైం వార్తలు

డీఆర్​ఎన్​ కండ్రిగ సమీపంలోని అటవీ ప్రాంతంలో గల మామిడి తోటలో ఓ మహిళ మృతదేహం బయటపడింది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. తోట నుంచి దుర్వాసన రావడం వల్ల పశువుల కాపర్లు ఈ విషయాన్ని గుర్తించారు.

woman died in a suspicious way in drn kandriga
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ

By

Published : Oct 17, 2020, 8:19 PM IST

గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం డీఆర్​ఎన్​ కండ్రిగ సమీపంలోని అటవీ ప్రాంతంలో గల మామిడి తోటలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. తోటలో నుంచి దుర్వాసన వస్తుండటం వల్ల అటుగా వెళ్తున్న పశువుల కాపర్లు అప్రమత్తమయ్యారు.

ఆ ప్రాంతాన్ని పరిశీలించి చూడగా... అసలు విషయం తెలిసింది. అనంతరం వారు మామిడి తోట యజమానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెదురుకుప్పం ఏఎస్సై శివప్రసాద్ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details