Wife killed Husband: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో విజయ్, వనిత నివాసం ఉంటున్నారు. విజయ్ సెల్‌షాపు నిర్వహిస్తున్నాడు. వారం క్రితం ఎప్పటిలాగే షాప్‌కు వెళ్లిన విజయ్ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఉదయం విజయ్ సోదరుడు, మిత్రులు గాలించిన ఆచూకీ లభించలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండరాజు కుప్పం క్వారీ వద్ద విజయ్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతుని ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తు వేగం పెరగటంతో భయపడిన విజయ్ భార్య గుండరాజు కుప్పం వీఆర్వోకు హత్య వివరాలు వెల్లడించింది. వీఆర్వో.. విజయ్ భార్యను పోలీసులకు అప్పగించాడు. తానే ప్రియుడు తమిళ అరసన్నుతో హత్య చేయించినట్లు ఆమె ఒప్పుకుంది.