ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం నుంచి రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం చెన్నై నుంచి సైనిక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న ఉపరాష్ట్రపతి... అక్కడి నుంచి 10 గంటల 15 నిమిషాలకు ఏర్పేడులోని ఐఐటీ తిరుపతికి చేరుకోనున్నారు. ఐఐటీ ప్రాంగణాన్ని సందర్శించటంతో పాటు అక్కడి విద్యార్ధులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖి నిర్వహించనున్నారు.
అనంతరం తిరుపతికి వెళ్లనున్నారు. కరకంబాడి సమీపంలోని అమర హాస్పిటల్‌ను ప్రారంభించనున్నారు. తర్వాత సాయంత్రం తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న ఉపరాష్ట్రపతి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. శుక్రవారం దర్శనం అనంతరం రేణిగుంట విమానశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి సూరత్ వెళ్ళనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని జిల్లా అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.