చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరుపల్లెలో ఓ మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ నరేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 1వ తేదీన బాలిక అవ్వకు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళిన వాలంటీర్ ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని స్నానం చేసి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డినట్లు విద్యార్ధిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు లేకుండా చూసేందుకు స్థానిక నాయకులు గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. అది విఫలం కావటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాలికపై లైంగికదాడి: పోలీసు కేసు నమోదు - chittoor dst volunteer raped cases
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరుపల్లెలో మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం చేశాడు. ఈ నెల 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
volunteer raped a minor a girl in chitoor dst punganoor