వృద్ధురాలిపై వ్యక్తి అత్యాచార యత్నం .. బండరాయితో కొట్టి హతమార్చిన గ్రామస్థులు - Chittoor crime news
16:05 May 28
వృద్ధురాలిపై అత్యాచార యత్నం .. బండరాయితో కొట్టి హతమార్చిన గ్రామస్థులు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో దారుణం జరిగింది. గురుమూర్తి అనే వ్యక్తి గ్రామంలోని 60 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి చెవి కమ్మలు లాక్కొని తీవ్రంగా గాయపరచడంతో పాటు... అత్యాచారానికి యత్నించబోయాడు. దీన్ని గమనించిన గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని చెట్టుకు కట్టి దేహశుద్ధి చేశారు. తలపై బండరాయితో కొట్టడంతో గురుమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురుమూర్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చదవండి:కుమార్తెను ప్రేమించాడని... కడతేర్చాడు