ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆఖరి రోజుకు కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు - kalyana venkaewara swamy temple taja news

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు నేటితో ముగియనున్నాయి. స్వామివారికి అర్చకులు సుప్రభాత సేవ చేసి అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావంతో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నట్ల అధికారులు తెలిపారు.

venkatewsara swamy festival ended in chittoor dst srinivasamangapuram
venkatewsara swamy festival ended in chittoor dst srinivasamangapuram

By

Published : Jun 27, 2020, 4:44 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జ‌రుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.

ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు ఆల‌య ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

రేపు ఉదయం పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.

ఇదీ చూడండి:

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవు: కేంద్ర జలశక్తి శాఖ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details