ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రవాసాంధ్రుల దాతృత్వం.. రైతులకు సాయం - దాతృత్వం చాటుకున్న ప్రవాసాంధ్రులు

చిత్తూరు జిల్లాలోని రైతులను ఆదుకోవడానికి అమెరికాలోని తెలుగు వారు కంకణం కట్టుకున్నారు. ఒక టమోటా చాలెంజ్ గ్రూప్​ని ఏర్పాటు చేసి స్థానిక రైతులనుంచి గిట్టుబాటు ధరతో సోషల్​ మీడియా ప్రతినిథుల ద్వారా కొనుగోలు చేయిస్తున్నారు. ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్దమయ్యారు.

vegitables free distribution at chittor
ప్రవాసాంధ్రుల దాతృత్వం

By

Published : May 10, 2020, 5:33 PM IST

ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నలకు మాత్రం అన్నం పెట్టే నాధుడే కరువయ్యాడు ఈ రోజుల్లో. అయితే ..చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ పరిథిలోని రైతులను ఆదుకోవడానికి అమెరికాలోని తెలుగు వారు సంకల్పించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి.. సతీష్​రెడ్డి, దేవరఇంటి రామకృష్ణారెడ్డి, రవి శంకర్​ రెడ్డి ద్వారా కొనుగోలు చేస్తున్నారు.

సుమారు 40 టన్నుల టమోటా, 13 టన్నుల ఎర్రగడ్డలు, రెండు టన్నులు క్యాబేజీ, 3 టన్నులు వంకాయలు, 5 టన్నుల క్యారెట్ లను కొనుగోలు చేయించి, స్థానిక పేద ప్రజకు ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా కరోనా కాలంలో రైతన్నలు నష్టపోకుండా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details