చిత్తూరు జిల్లాలో కొవిడ్ పరిస్థితిపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. తిరుపతి ఎస్వీ వర్సిటీలో ఉన్నతాధికారులు, వైద్యులతో సమావేశమయ్యారు. మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సమీక్షలో పాల్గొని ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ లభ్యతపై చర్చించారు.
కేంద్రం 500 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఇస్తోందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆక్సిజన్ కొరత, పడకల కొరత రాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. కొవిడ్ కేంద్రాలు పెంచితే ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందన్న ఆళ్ల నాని... ప్రతి నియోజకవర్గంలో కొవిడ్ కేంద్రం ఏర్పాటుకు యోచిస్తున్నట్టు వెల్లడించారు.