భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. రాష్ట్ర భాజపా నేతలతో సమావేశమయ్యారు. అమిత్ షాతోపాటు ఈ భేటీలో ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్ పాల్గొన్నారు. వీరితో గంటన్నరపాటు అమిత్ షా రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అమిత్ షా తిరిగి దిల్లీ వెళ్లిపోనున్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా.. ఏపీకి వచ్చిన అమిత్ షా.. ఈనెల 13వ తేదీ సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. ఆ తర్వాత సీఎం జగన్‌తో కలిసి తిరుమల వెళ్లి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శనివారం రాత్రి తాజ్ హోటల్‌లో బస చేసి ఆదివారం ఉదయం నెల్లూరులో స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం తిరుపతిలో జరిగిన 29వ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి హాజరయ్యారు.
తిరుపతిలోని తాజ్‌హోటల్‌లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన సమావేశంలో ఏపీ సీఎం జగన్‌తో పాటు కర్ణాటక, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై, రంగస్వామి హాజరుకాగా.. ఏపీ నుంచి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, తమిళనాడు మంత్రులు పొన్ముడి, వీకే శేఖర్, కేరళ మంత్రులు బాలగోపాల్, రాజన్, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, కర్ణాటక మంత్రులు వి.సుధాకర్, ఆర్.అశోక్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్రకుమార్ జోషి, లక్షద్వీప్ పరిపాలనాధికారి ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ బల్లా, ఐఎస్‌సీఎస్ డైరెక్టరు విక్రాంత్ పాండే, ఏపీ సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Attack on Actress : వాకింగ్‌కు వెళ్లిన.. హీరోయిన్ పై దాడి!