ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను, అత్తను చంపాడు...చివరికి చిక్కాడు - చిత్తూరు జంట హత్యల కేసు వార్తలు

వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు...నిలదీసినందుకు భార్యను చంపేశాడు..తన కూతురు ఏదని అత్త అడిగినందుకు ఆమెను హతమార్చాడు..తల్లి, అమ్మమ్మ కనిపించకపోవటంతో... వారిని ఏం చేశావని ఆ కసాయి తండ్రిని బిడ్డలు అడిగారు. కరోనా సోకిందని నమ్మబలికి...వారిని ఓ ఇంట్లో బంధించాడు. చివరకు బంధువుల ఫిర్యాదుతో పోలీసులకు చిక్కాడు. ఈ జంట హత్యల ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది.

Two women murder case chased in Chittoor district
భార్యను, అత్తను చంపాడు...చివరికి చిక్కాడు

By

Published : Feb 1, 2021, 10:32 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం గంగి రెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఇద్దరు మహిళల హత్య కేసును పోలీసులు ఛేదించారు. జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు మౌలాలిని సోమవారం అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి వెల్లడించారు.

డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు..

గంగిరెడ్డి పల్లికి చెందిన మౌలాలి వివాహేతర సంబంధం కారణంగా భార్య సరళ (40)ను గతేడాది సెప్టెంబర్ 29న హత్య చేసి పెద్దేరు ప్రాజెక్టు నీళ్లలో మృతదేహాన్ని పడేశాడు. కూతురు కనబడకుండా పోవడంతో సరళ తల్లి గంగులమ్మ మౌలాలినీ నిలదీసింది. ఆమెను కూడా అక్టోబర్ 1న గొంతుకు బిగించి చంపి గంగ చెరువు నీటిలో మృతదేహాన్ని దాచాడు. తల్లి, అమ్మమ్మ కనపడకుండా పోవడంతో సరళ ముగ్గురు పిల్లలు 7, 11, 15 సంవత్సరాల వయసు గల కుమారుడు, ఇద్దరు కుమార్తెలు మౌలాలి నిలదీశారు. సరళ, గంగులమ్మలకు కరోనా సోకింది... ఆసుపత్రిలో ఉన్నారని సమాధానమిచ్చాడు. పిల్లలను కర్ణాటకలోని ఒక ప్రాంతంలో నిర్బంధంలో ఉంచాడు.

భార్యను, అత్తను చంపాడు...చివరికి చిక్కాడు

ఇటీవల సరళ, గంగులమ్మ, ముగ్గురు పిల్లలు కనిపించలేదని బంధువులు పోలీసుల దృష్టికి తెచ్చారు. ములకలచెరువు సీఐ సురేష్ కుమార్, తంబళ్లపల్లె ఎస్.ఐ సహదేవి సిబ్బంది చేపట్టిన దర్యాప్తులో సరళ, గంగులమ్మ మృతదేహాలను పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో దుస్తులు ఎముకలు మాత్రం గుర్తించారు. పోలీసులు ఆ ఆనవాళ్లను డీఎన్ఏ పరీక్షలకు పంపి మౌలాలిపై హత్య కేసు నమోదు చేశారు. పిల్లల ఆచూకీని కనుగొని వారి బంధువులకు అప్పజెప్పినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:శవమై తేలిన సర్పంచ్ అభ్యర్థి భర్త ..నిన్న అపహరణకు గురైన మృతుడు

ABOUT THE AUTHOR

...view details