ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆడుకునేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ బావి వద్దకు వెళ్లి బావి పూడులో ఇరుక్కొని మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలో చోటు చేసుకుంది.

chittor district
ఆడుకునేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

By

Published : Jul 27, 2020, 12:17 AM IST

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండల పరిధిలోని యాలకల్లు పంచాయతీ కప్పట్ల బండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు బావిలో నీరు చేరింది. దీంతో పిల్లలు ఆడుకుంటూ బావి వద్దకు వెళ్ళారు. ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో ఈతకు దిగారు. బావిలో పూడు ఉండటంతో కిరణ్ (7), మంజు (7) ఇరుక్కుపోయారు. వారు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన వీరితో పాటు వెళ్ళిన మరో బాలుడు గడ్డపై నుంచి పరుగున వెళ్ళి గ్రామస్థులకు విషయం తెలిపాడు. వారు పరుగుపరుగునా వచ్చి బావి వద్దకు చేరుకుని పరిశీలించగా అప్పటికే పిల్లలు బావిలో మృతి చెంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

వీరిద్దరు అన్నదమ్ముల కుమారులు. పిల్లల మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే పిల్లలకు అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చదవండి కష్టమంటే చాలు.. ఇంట్లో మనిషైపోతున్నాడు సోనూసూద్

ABOUT THE AUTHOR

...view details