ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ, ద్విచక్రవాహనం ఢీ.. ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదం వార్తలు

చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

లారీ,ద్విచక్రవాహనం ఢీ
లారీ,ద్విచక్రవాహనం ఢీ

By

Published : Jun 5, 2022, 8:13 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద తిరుపతి-చైన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తిరుపతి చెర్లోపల్లికి చెందిన భాను, రాముగా గుర్తించారు. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details