ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గదిలోకి వెళ్లినవారు బయటకు రాలేదు... తలుపులు తెరిస్తే! - చిత్తూరు జిల్లా క్రైమ్ వార్తలు

చిత్తూరు జిల్లాలో పీలేరు పట్టణంలో ఇద్దరు మృతి స్థానికంగా కలకలం స్పష్టించింది. ఓ గదిలో మహిళ, పురుఘడు విగతజీవుల్లా పడి ఉన్నారు. మృతికి గల కారణాలేంటనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Two died in a room suspiciously in peeleru
అనుమానాస్పద రీతిలో ఇద్దరు మృతి

By

Published : Dec 29, 2019, 11:42 PM IST

అనుమానాస్పద రీతిలో ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం వీవర్స్ కాలనీలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పీలేరు ఎస్సై కృష్ణయ్య కథనం మేరకు... చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలం వంకమద్దివారిపల్లెకు చెందిన శ్రీనివాసులు (47).... పీలేరు పట్టణ సమీపంలోని వీవర్స్ కాలనీలో చేనేత పని చేస్తున్నారు. ఇక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఎర్రావారిపాలెం మండలం పులిపర్తివారిపల్లికి చెందిన అమరావతి (38)తో మూడేళ్లుగా పరిచయం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఇద్దరు ఇంట్లోకి వెళ్లారు. ఆదివారం సాయంత్రం అయినా తలుపులు తీయలేదు. ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కృష్ణయ్య... సిబ్బందితో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. అక్కడ ఇద్దరూ విగతజీవులుగా ఉండటాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details