ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కారణంగా విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి' - news updates in thirupathi

తిరుపతిలోని బాలమందిర్, బదిర పాఠశాల, కళాశాలలను తిరుపతి జేఈఓ సదాభార్గవి పరిశీలించారు. కరోనా కారణంగా విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో పరిశుభ్రత పాటించేలా విద్యార్థులకు అవగాహన కలిగించాలని అన్నారు.

ttd thirupathi jeo sadhabhargavi inspect deaf and dumb school in thirupathi
తిరుపతి బదిర పాఠశాలను సందర్శిస్తున్న తిరుపతి జేఈఓ

By

Published : Mar 17, 2021, 9:43 PM IST

కరోనా కారణంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తిరుపతి జేఈఓ సదాభార్గవి అన్నారు. బాలమందిర్, బదిర పాఠశాల, కళాశాలను తనిఖీ చేసిన ఆమె... వసతి గృహాల్లోని వంటగదులు, విద్యార్థుల గదులు, తరగతి గదులను పరిశీలించారు. హాస్టల్ గదుల్లో విద్యార్థుల మంచాల మధ్య దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో పరిశుభ్రతను పాటించాలన్నారు. బాలమందిర్ భవనాలకు సున్నం వేయించి, పూల మొక్కలు పెంచి సుందరీకరించాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details