ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో శుభప్రదం వేసవి శిక్షణ ముగింపు - childrens

తిరుపతి మహతి క్షేత్రంలో శుభప్రదం వేసవి శిక్షణ తరగతుల ముగింపు వేడుకలు నిర్వహించారు. చిన్నారుల్లో సంస్కృతి, సంప్రదాయాలు, మానవీయ విలువలు పెంపొందించటానికి శుభప్రదం వేసవి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపకరించాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

శుభప్రదం

By

Published : Jun 2, 2019, 5:47 PM IST

తిరుపతిలో శుభప్రదం వేసవి శిక్షణ తరగతుల ముగింపు వేడుకలు

తితిదే, హిందూధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన శుభప్రదం వేసవి శిక్షణ తరగతుల ముగింపు వేడుకలను తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించారు. చిన్నారుల్లో సంస్కృతి, సంప్రదాయాలు, మానవీయ విలువలు పెంపొందించటానికి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపకరించాయని తితిదే అధికారులు తెలిపారు. వేడుకలకు తిరుమల జేఈవో లక్ష్మికాంతం, తితిదే అధికారులు హాజరయ్యారు. ముందుగా ఎస్వీ జూనియర్ కళాశాల నుండి మహతి కళాక్షేత్రం వరకు విద్యార్ధులు, తితిదే అధికారులు శోభాయాత్ర చేపట్టారు. వారం రోజుల పాటు జరిగిన శుభప్రదం శిక్షణ తరగతులకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 3 వేల 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్ధుల నృత్యాలు, పాటలు ఆహూతులను అలరించాయి.

ABOUT THE AUTHOR

...view details