స్విమ్స్, తితిదే అధికారులతో ఈవో జవహర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పేషంట్లకు నూతన బ్లాక్ నిర్మించి రోగులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తితిదే ఈవో అధికారులను ఆదేశించారు. ఆరోగ్య బీమా ఉన్న రోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో నగదు రహిత వైద్యసేవలు అందించాలని సూచించారు. ఐటీ సేవలు వినియోగించుకోని రోగులకు మరింత వేగవంతంగా వైద్య సేవలు అందించాలన్నారు.
ఆరోగ్య బీమా ఉన్న రోగులకు కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు: ఈవో జవహర్ రెడ్డి - స్విమ్స్, తితిదే అధికారులకు ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పేషంట్లకు నూతన బ్లాక్ నిర్మించి రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్విమ్స్, తితిదే అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈవో.. ఆరోగ్య బీమా ఉన్న రోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో నగదు రహిత వైద్యసేవలు అందించాలని సూచించారు.
హెచ్ఆర్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ అప్లికేషన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో రేడియాలజీ ఇమేజింగ్ సిస్టమ్ (PACS)ద్వారా ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ తీసుకున్న రోగుల స్కానింగ్ రిపోర్టులు సంబంధింత డాక్టర్లకు ఆన్‌లైన్‌లో పంపేలా నూతన సాప్ట్‌వేర్ రూపొందించాలని అధికారులకు సూచించారు. తితిదే విద్యాసంస్థల్లోని విద్యార్థుల వివరాలు నమోదు కోసం స్టూడెంట్ సాప్ట్‌వేర్ రూపొందించాలని అన్నారు. సమావేశంలో స్విమ్స్ ఛైర్మన్ డాక్టర్ వెంగమ్మ పాల్గొన్నారు.
ఇదీ చదవందడి: