తిరుమలకు కాలినడకన తితిదే నూతన ఛైర్మన్ - తితిదే ఛైర్మన్
తితిదే ఛైర్మన్గా ఇవాళ బాధ్యతలు చేపట్టనున్న వై వి సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు నడిచి వెళ్లారు.
శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు నడిచి వెళ్తున్న వైవీ సుబ్బారెడ్డికి చంద్రగిరి వైకాపా నాయకులు నాయకులు కార్యకర్తలు వైవీ సుబ్బారెడ్డిని సత్కరించారు. తితిదే ఛైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తీయకుండా...తారతమ్యాలకు లేకుండా అందరికీ సమన్యాయం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారని వెల్లడించారు. అనంతరం శ్రీవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు చేసి శ్రీవారి మెట్టు మార్గం గుండా కాలినడకన తిరుమలకు బయలుదేరారు.