తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో విమాన గోపురానికి బంగారు తాపడం పనులు.. వచ్చే ఏడాది మే నెల నాటికి పూర్తి చేస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలోని విమాన గోపురాన్ని తితిదే ఈవో జవహర్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఆలయంలో ఐదు రోజులుగా జరుగుతున్న బాలాలయ కార్యక్రమాలు సంప్రోక్షణతో ఇవాళ ముగిశాయి.
govindaraja swamy temple:'బంగారు తాపడం పనులను మే నాటికి పూర్తి చేస్తాం' - వైవీ సుబ్బారెడ్డి తాజా సమాచారం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. ఆలయంలోని విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేస్తామన్నారు. పనులు పూర్తయ్యే వరకు భక్తులకు మూలమూర్తి దర్శనం యథావిధిగా ఉంటుందన్నారు.
వైవీ సుబ్బారెడ్డి
ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టాలని 2018వ సంవత్సరంలో తితిదే బోర్డు నిర్ణయం తీసుకుందని... రూ.32 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 100 కిలోల బంగారం, 4,300 కిలోల రాగి వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయ్యే వరకు భక్తులకు మూలమూర్తి దర్శనం యథావిధిగా ఉంటుందని.. కైంకర్యాలన్నీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి