ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెంగుళూరులో 'గుడికో గోమాత'ను ప్రారంభించిన తితిదే ఛైర్మన్ - చిత్తూరు జిల్లా వార్తలు

బెంగుళూరులో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించారు తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి. త్వరలో తమిళనాడులోనూ ఈ కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. తితిదేకు చెందిన ఎస్వీ గోసంరక్షణ శాలకు గోవులను దానం చేయాలని ఆయన కోరారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు 216 గోవులను దానం చేయడానికి ముందుకొచ్చారని తెలిపారు.

ttd chairman started 'Gudiko Gomata' in Bangalore
'గుడికో గోమాత'ను ప్రారంభించిన తితిదే ఛైర్మన్

By

Published : Dec 13, 2020, 10:49 PM IST

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి ఆలయానికి ఆవు, దూడ అందించారు. దేశంలోని మఠాలు, పీఠాలు, వేద పాఠశాలలకు కూడా గోవులను అందిస్తామని ఆయన తెలిపారు. త్వరలో తమిళనాడులోనూ గుడికో గోమాత కార్యక్రమానికి శ్రీకారం చుడతామని వివరించారు. అందుకు తితిదేకు చెందిన ఎస్వీ గోసంరక్షణ శాలకు గోవులను దానం చేయాలని ఆయన కోరారు.

స్థానిక సలహామండలి సభ్యులు, ఇతర ప్రముఖులు 216 గోవులను దానం చేయడానికి ముందుకొచ్చారని వెల్లడించారు. కర్ణాటకలో గోమాత కోసం దరఖాస్తు చేసిన ఆలయాలను సందర్శించడానికి కమిటీని నియమించినట్టు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కార్డుదారులు కనిపించడం లేదు...

ABOUT THE AUTHOR

...view details