తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను విస్తృతపరిచేందుకు పలు ఆలయాలను విలీనం చేసుకున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం, శ్రీరంగరాజపురం, పెనుమూరు మండలాల్లో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామితో కలిసి తితిదే ఛైర్మన్ పర్యటించారు.
పర్యటనలో భాగంగా... కార్వేటినగరంలోని తితిదే అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాలస్వామి మందిరంలో పూజలు చేశారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఇటీవల తితిదేలో విలీనమైన ఆలత్తూరు వరద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయ అధికారులకు సంబంధిత పత్రాలు అందజేశారు. శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లి గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.