చిత్తూరు జిల్లా ఉలసలవారి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెదురు కర్రలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో శ్రీనివాసులు, కృష్ణయ్య అనే ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్లో ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చిన్నగొట్టిగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ట్రాక్టర్ బోల్తా...ఇద్దరు రైతుల మృతి - చిత్తూరులో ట్రాక్టర్ బోల్తా
టమోట పంటకు వాడే వెదురు కర్రలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు రైతులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం చిత్తూరు జిల్లా ఉలసలవారి పల్లి వద్ద చోటుచేసుకుంది.
ఇద్దరు రైతులు మృతి