ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన - చిత్తూరు జిల్లా నేటి వార్తలు

ముఖ్యమంత్రి జగన్.. రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఊరందూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తారు. ఈ మేరకు సభాస్థలి ఏర్పాట్లను మంత్రులు, జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

tomorrow Chief Minister Jagan visit Chittoor district
సభాస్థలి ఏర్పాట్ల పరిశీలన

By

Published : Dec 27, 2020, 7:21 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు వద్ద నిర్వహించనున్న ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఉదయం 10.45 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్​లో ఊరందూరుకి వెళ్లి సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్​ను ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం పేదలకు ఇంటిపట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరానికి ముఖ్యమంత్రి జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మేరకు సభాస్థలి ఏర్పాట్లను మంత్రులు, జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details