ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు కడప, చిత్తూరులో చంద్రబాబు ప్రచారం - చిత్తూరు

నేడు రెండు జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందుగా కడప జిల్లాలో పర్యటించి అనంతరం చిత్తూరు చేరుకుంటారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు

By

Published : Apr 1, 2019, 6:28 AM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు
నేడు రెండు జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందుగా కడప జిల్లాలో పర్యటించి అనంతరం చిత్తూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు కడప జిల్లా జమ్మలమడుగులో బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం పులివెందులలో ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 నిమిషాలకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 6.15 నిమిషాలకు పూతలపట్టులో పర్యటిస్తారు. తర్వాత 7.30 నిమిషాలకు సంతపేటలో రోడ్​షో నిర్వహిస్తారు. రాత్రి తొమ్మిది గంటలకు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు.

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details