చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పరిశీలించారు. ఆలయంలో అనధికారికంగా శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని తనిఖీ చేశారు. భద్రతా విభాగం పనితీరును పరిశీలించారు.
అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించామని అనుమానితులను అదుపులోకి తీసుకుని నిందుతులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.