ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి నగరపాలక మేయర్‌ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌.శిరీష?

తిరుపతి నగరపాలక సంస్థ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లను వైకాపా ఖరారు చేసింది. నేడు జరగనున్న ఈ పదవుల ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే... అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

tirupathi mayor seat conformed
తిరుపతి నగరపాలక మేయర్‌ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌.శిరీష?

By

Published : Mar 18, 2021, 9:24 AM IST

అధికారికంగా ప్రకటించనప్పటికీ తిరుపతి నగరపాలక సంస్థ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మేయర్‌గా ఇదివరకు అనుకున్నట్లుగానే 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ డాక్టర్‌ ఆర్‌.శిరీష, డిప్యూటీ మేయర్లుగా 4, 14వ డివిజన్‌ కార్పొరేటర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్ర నారాయణను వైకాపా ఎంపిక చేసింది. వీరిలో తిరుపతి తొలి మేయర్‌గా ఆర్‌.శిరీషతో పాటు డిప్యూటీ మేయర్‌గా ముద్ర నారాయణ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రెండో డిప్యూటీ మేయర్‌ పదవి కోసం పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదముద్ర పడిన అనంతరం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తనయుడు భూమన అభినయ్‌రెడ్డి మరో ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. డిప్యూటీ మేయర్‌గా అభినయ్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డికి సూచించినట్లు తెలిసింది.

కార్పొరేషన్‌ కార్యాలయంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 49 మంది కార్పొరేటర్లు కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేశారు. తెదేపా నుంచి ఎన్నికైన ఆర్‌సీ మునికృష్ణకు మాత్రం ప్రత్యేకంగా సీటు కేటాయించారు. ఎక్స్‌ అఫీిషియో సభ్యులుగా కరుణాకర్‌రెడ్డి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక, ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు.

ఇదీ చదవండి:

శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు

ABOUT THE AUTHOR

...view details