ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం బదులు శానిటైజర్ తాగి ముగ్గురు మృతి - sanitizer death news in chittoor dst

మద్యం బదులు శానిటైజర్లు తాగి చిత్తూరు జిల్లా తిరుచానూరు పరిధిలోని యోగి మల్లవరంలో ముగ్గురు మృతిచెందారు. చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే వీరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారని సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.

three died in chitoor dst  due to drink sanitizer insteaded of alcohol
three died in chitoor dst due to drink sanitizer insteaded of alcohol

By

Published : Jun 30, 2020, 4:55 PM IST

చిత్తూరు జిల్లా తిరుచానూరు పరిధిలోని యోగి మల్లవరంలో దారుణం జరిగింది. మద్యం బదులుగా శానిటైజర్లు తాగి గడచిన రెండు రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. యోగి మల్లవరంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న మల్లిక, లత, సెల్వం వీరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.

మద్యానికి బానిసలై వీరు మందుకి బదులుగా దాతలు ఇచ్చిన శానిటైజర్లు తాగి మృతిచెందారని తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. మృతుల్లో మల్లిక,లత తమిళనాడు రాష్ట్రం కడలూరుకి చెందినవారు కాగా సెల్వంది తిరుపతి పేపర్స్ కాలనీ అని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా వస్తే.. ఆస్పత్రికి వెళ్లడం కంటే ఇల్లే మేలట!

ABOUT THE AUTHOR

...view details