చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ ఉత్సవాలు మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనతో పరిసమాప్తమయ్యాయి. చివరిరోజున ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పవిత్రస్నానం శాస్త్రోక్తంగా జరిపారు. పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అమ్మవారి పద్మపుష్కరణి చక్రస్నానం వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ముగిసిన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు - తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరిరోజున అర్చకుులు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.
'ముగిసిన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు'