పింఛను రావటం లేదని వృద్ధులు, వికలాంగుల ఆవేదన వైఎస్ఆర్ పెన్షన్ పథకాన్ని.. వయసు పైబడిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా.. ఈ పథకం లబ్ధిదారుల జాబితా నుంచి చాలా మంది వృద్ధుల పేర్లు గల్లంతయ్యాయి. వృద్ధులకు తీరని ఆవేదన కలిగించింది. చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది.
స్పందనలో ఫిర్యాదు
ఈ మధ్యే అమల్లోకి వచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా.. పింఛను లబ్ధిదారులపై సర్వే నిర్వహించారు. ఆ తర్వాతే చాలా పేర్లు జాబితా నుంచి మాయమయ్యాయి. తప్పులు నమోదవడమే తమ పాలిట శాపంగా మారిందంటూ వృద్ధులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ సమస్యను స్పందన కార్యక్రమంలో ఉన్నతాధికారులకు విన్నవించారు. పింఛన్లు కోల్పోయిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇస్తున్న అర్జీలే ఎక్కువగా తిరుపతి స్పందన కార్యక్రమంలో దర్శనమిచ్చాయి. పొంతన లేని కారణాలతో తమకు పింఛను నిరాకరించారని తెబుతున్న వీరందరూ.. తిరుపతి నగరపాలక సంస్థలో ఉన్నతాధికారులను కలిశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి:
'ఏఎన్యూ ఉపకులపతి రాజీనామా చేయాలి