ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరుస చోరీల కేసులో నిందితులు అరెస్టు - latest news of chori in chittoor dst

చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను అనంతపురం జిల్లాకు చెందిన పాత నేరస్థుడిగా గుర్తించారు.

thefes arrested in chittoor dst penamaor
thefes arrested in chittoor dst penamaor

By

Published : Jul 6, 2020, 10:29 PM IST

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన దొంగతనం కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. పెనుమూరులో రెండు ఇళ్లలో వరుస చోరీలు జరగ్గా.. పాకాల సీఐ ఆశీర్వాదం నేతృత్వంలో పోలీసులు కోసం గాలింపు చేపట్టారు. అనంతపురం జిల్లాకు పాత నేరస్థుడు షికారి రవి.. తన అనుచరులతో కలిసి ఇటీవల జిల్లాలో ఇళ్ల దోపిడీలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

పెనుమూరు పోలీసులు ప్రత్యేక నిఘాతో చేపట్టిన గాలింపులో నేండ్రగుంట సమీపంలో పట్టుబడ్డాడు. అతనితో పాటు మరికొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుమూరు, భాకరాపేట, నగరి, పీలేరు, పూతలపట్టు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు నిందితుల అంగీకరించారు. వారి నుంచి 130 గ్రాముల బంగారు, 800 గ్రాముల వెండి, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details