ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో 82కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు - చిత్తూరు జిల్లాలో లాక్​డౌన్ ప్రభావం

చిత్తూరు జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. నేడు కొత్తగా ఒకరికి కరోనా సోకింది. ఫలితంగా జిల్లాలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 82కు చేరింది. మరో వైపు మద్యం దుకాణాలు తెరవడంతో తమిళనాడు నుంచి భారీగా మందుబాబులు వచ్చి మద్యం కొనుగోలు చేశారు.

The number of corona positive cases in Chittoor district reached 82
చిత్తూరు జిల్లాలో 82కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

By

Published : May 5, 2020, 9:44 PM IST

చిత్తూరు శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈకేసుతో ఇప్పటివరకూ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82కు చేరింది. 8మంది డిశ్ఛార్జ్ కాగా...కోలుకున్న వారి సంఖ్య 45కు చేరింది. ఫలితంగా జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 37కి తగ్గింది.

మద్యం దుకాణాలు తెరవడంతో జిల్లా వ్యాప్తంగా దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన బలిజకండ్రిగకు పక్క రాష్ట్రం నుంచి మద్యంప్రియులు వస్తున్నందున అధికారులు దుకాణాలను మూసివేశారు.

ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలో మద్యం దుకాణాల వద్ద మహిళలు ఆందోళన చేయడంతో అధికారులు షాపులను మూసివేశారు. తమను స్వరాష్ట్రాలకు పంపించాలంటూ తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వలస కూలీలు ఆందోళన చేశారు.

ఇదీచదవండి.

పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన

ABOUT THE AUTHOR

...view details