ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ratnams family ఆ భూమికి పట్టా ఇవ్వండి.. రైతు రత్నం కుటుంబం

చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దారు కార్యాలయంలో శనివారం గుండెపోటుతో చనిపోయిన రైతు రత్నం కుటుంబీకులు శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు అక్కడే ఆందోళన చేశారు. ఏ భూమి కోసం తమ తండ్రి న్యాయ పోరాటం చేసి రెవెన్యూ అధికారుల ఎదుటే అసువులు బాశారో దానిని తమకు పట్టా చేయాలని రైతు రత్నం కుటుంబ సభ్యులు డిమాండు చేశారు. తమ తండ్రి 47 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి మరణించినందున ఏడాదికి రూ.లక్ష చొప్పున రూ.47 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను కుటుంబీకులు కోరారు.

Farmer Ratnams family members
ఆ భూమి పట్టా ఇవ్వండి.. రైతు రత్నం కుటుంబం

By

Published : Sep 5, 2022, 11:16 AM IST

Farmer Ratnams family members: ఏ భూమి కోసం తమ తండ్రి న్యాయ పోరాటం చేసి రెవెన్యూ అధికారుల ఎదుటే అసువులు బాశారో దానిని తమకు పట్టా చేయాలని రైతు రత్నం కుటుంబ సభ్యులు డిమాండు చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దారు కార్యాలయంలో శనివారం గుండెపోటుతో చనిపోయిన రైతు రత్నం కుటుంబీకులు శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు అక్కడే ఆందోళన చేశారు. రత్నం కుమార్తె జ్యోతి, కుమారులు శివప్రసాద్‌, శివకుమార్‌లకు మద్దతుగా ఆదివారం వివిధ జిల్లాల వడ్డెర సంఘం నాయకులు తరలివచ్చారు. తమ తండ్రి 47 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసి మరణించినందున ఏడాదికి రూ.లక్ష చొప్పున రూ.47 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను కుటుంబీకులు కోరారు. విన్నపాలను రాతపూర్వకంగా అంగీకరించే వరకు తహసీల్దారు కార్యాలయం నుంచి కదిలే ప్రసక్తి లేదన్నారు. చిత్తూరు ఆర్డీవో రేణుక సముదాయించినా నిష్ఫలమైంది. శనివారం రాత్రి కలెక్టరు హరి నారాయణన్‌ ఫోన్‌ చేసి 20 నిమిషాలు మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం కలెక్టరేట్‌కు వస్తే మరోసారి మాట్లాడతానని చెప్పారు. కలెక్టరు ఆదేశాల మేరకు డీఆర్వో రాజశేఖర్‌ వచ్చి వారితో చర్చించారు. ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి రత్నం అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకుముందు శనివారం రాత్రి తమ తండ్రి మృతి విషయంలో అనుమానం ఉందని, పోస్టుమార్టం చేయించాలని రత్నం కుటుంబీకుల విన్నపం మేరకు పోలీసులు ఈ ప్రక్రియను పూర్తి చేయించారు.

న్యాయం అందకే రైతు మృతి: చంద్రబాబు

ప్రభుత్వం న్యాయం చేయకపోవడంవల్లే రైతు రత్నం ప్రాణాలు కోల్పోయారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా నేతల స్వార్థానికి ఇంకెంత మంది సామాన్యులు బలి కావాలని ప్రశ్నించారు. ‘న్యాయస్థానం ఉత్తర్వు ఇచ్చాకా ప్రభుత్వం న్యాయం చేయలేకపోవడం దురదృష్టకరం. దీనిపై సమగ్రంగా విచారణ జరపాలి’ అని చంద్రబాబు ట్వీట్‌లో డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై ‘ఈటీవీ’లో వచ్చిన కథనాన్ని ఆయన ట్వీట్‌కు జత చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details