కేంద్ర ప్రభుత్వ ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ...తిరుపతిలో వైద్యులు ధర్నా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ ఎదుట జూనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. వైద్యకళాశాల నుంచి తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్ ఎంసీ బిల్లు అమలు వైద్యరంగానికి తీరని చేటన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమ ఆలోచనలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పటికే అత్యవసర సేవలను బహిష్కరించామన్న వైద్యులు...కేంద్రం దిగిరాని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనను ఉద్ధృతం చేస్తామని వైద్యులు తెలిపారు.
కేంద్రం ఎన్ఎంసీ బిల్లును ఉపసంహరించుకోవాలి - తిరుపతి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ తిరుపతిలో వైద్యులు ధర్నా నిర్వహించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
the-center-should-withdraw-the-nmc-bill
ఇది చూడండిః ఎలైట్ ప్యానల్లో భారత్ అంపైర్‌కు దక్కని చోటు