చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురం చెక్పోస్ట్ పరిధిలో ప్రత్యేక కార్యదళం అధికారులు కూంబింగ్ నిర్వహించారు. చైతన్యపురం వద్ద స్మగ్లర్ల కదలికలను గమనించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. వాటిని తరలించేందుకు ప్రయత్నించిన స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద ఉన్న కారును సీజ్ చేసినట్లు చెప్పారు.
Redsandal: పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. పోలీసుల అదుపులో స్మగ్లర్ - red sandalwood latest news
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురం చెక్పోస్ట్ పరిధిలో ప్రత్యేక కార్యదళం అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు
ఎర్రచందనం దుంగల తరలింపుపై స్మగ్లర్ను ప్రశ్నించగా.. దీనికి సూత్రధారి బెంగుళూరులో ఉన్నట్లు తెలిపాడని డీఎస్పీ చెప్పారు. అడవిలో దాచిన దుంగలను కారులో తరలిస్తుండగా ఆకస్మికంగా చేపట్టిన తనిఖీల్లో దొరికిపోయాడని అన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపట్టి, తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి:పోలీసుల అదుపులో.. ఎంకే కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్!