తెదేపా నాయకుల అరెస్టులకు నిరసనగా..ఆ పార్టీ నేతలు చిత్తూరు జిల్లాలో నిరసన తెలిపారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే రమేష్, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో పథకం ప్రకారం తెదేపా నాయకులపై అక్రమ కేసులు బనాయించి భయపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రమేష్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ అరెస్టులకు ఎవరు భయపడరన్నారు.
అరెస్టులను నిరసిస్తూ మదనపల్లెలో తెదేపా నేతల ఆందోళన - మదనపల్లెలో తెదేపా నిరసన
తెదేపా నేతల అరెస్టులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసన తెలుపుతున్నారు. వైకాపా అక్రమంగా కేసులు పెడుతోందని తెదేపా నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ అరెస్టులకు ఎవరు భయపడరని అంటున్నారు.
tdp protest