ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా నేతలను తృప్తి పరచడానికే అధికారులు పనిచేస్తున్నారు'

హత్యాయత్నం సెక్షన్​ను పోలీసులు దర్వినియోగం చేస్తున్నారని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. డీజీపీ వ్యవహార శైలితో సాటి పోలీసులే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏకగ్రీవాల కోసం వైకాపా నేతలు ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు.

tdp leaders allegations on government employees
వైకాపా నేతల కోసమే అధికారులు పనిచేస్తున్నారంటూ తెదేపా నేతల విమర్శలు

By

Published : Feb 5, 2021, 6:42 AM IST

డీజీపీ సవాంగ్ నేతృత్వంలోని రాష్ట్ర పోలీస్ శాఖ.. హత్యాయత్నం సెక్షన్​ను దుర్వినియోగం చేస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. అధికార పార్టీని తృప్తి పరిచేందుకు.. 307 సెక్షన్​ను పోలీసులు ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ వహారశైలి, పనితనం చూసి.. సాటి పోలీసులే నవ్వుకుంటున్నారన్నారు. మరో నాలుగైదు రోజులు అచ్చెన్నాయుడును జైల్లోనే ఉంచాలని.. పోలీసులు సీడీ ఫైల్​ని కోర్టుకు పంపించలేదని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీ మద్దతుదారుల నామినేషన్లు స్వీకరించకుండా.. ప్రభుత్వ యంత్రాంగంపై వైకాపా నాయకులు ఒత్తిడి తెస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ధ్వజమెత్తారు.

అధికార పార్టీ పెద్దల సూచనలతో.. చిత్తూరు జిల్లాలో అధికారులు పిచ్చి, పిచ్చి కారణాలతో నామినేషన్లు తిరస్కరిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో 90 శాతం ఏకగ్రీవాలు చేయాలన్న మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల ప్రకారమే అంతా జరుగుతోందని ఆరోపించారు. సున్నితమైన, అతి సున్నితమైన పోలింగ్ బూత్​ల పర్యవేక్షణ.. కేంద్ర బలగాల ఆధీనంలో ఉండేలా ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక అధికారులకు ఇతర ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details