ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుత్తూరులో ఫ్లెక్సీ వివాదం.. తెదేపా నిరసన

TDP LEADERS PROTEST: పుత్తూరులో నగరి తెదేపా ఇన్​ఛార్జ్​ గాలి భాను ప్రకాశ్ పుట్టినరోజు సందర్భంగా గత నెలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదమైంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఫ్లెక్సీలు తొలగించడంతో తెలుగుదేశ కార్యకర్తలు, కమిషనర్​ మధ్య వివాదం నెలకొంది.

TDP LEADERS PROTEST
TDP LEADERS PROTEST

By

Published : Jul 3, 2022, 1:53 PM IST

TDP LEADERS PROTEST: తిరుపతి జిల్లాలోని పుత్తూరు పట్టణంలో.. నగరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్​ఛార్జ్​ గాలి భాను ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా గత నెలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈరోజు ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో పుత్తూరు కమిషనర్ వెంకటరామిరెడ్డి ఫ్లెక్సీలను తొలగించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఫ్లెక్సీలు తొలగించడంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కార్యకర్తలు, కమిషనర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కమిషనర్ అసభ్య పదజాలంతో దూషించాడని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details