ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేణిగుంటలో తెదేపా నేతల అరెస్ట్.. గాజలమండ్యం పీఎస్​కు తరలింపు - చిత్తూరులో తెదేపా నేతల అరెస్ట్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్లిన తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

tdp leaders arrest at renigunta due to chandra babu tour
tdp leaders arrest at renigunta due to chandra babu tour

By

Published : Mar 1, 2021, 10:38 AM IST

Updated : Mar 1, 2021, 11:18 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టును నిరసిస్తూ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరుపతి, చిత్తూరులో తెదేపా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటించేందుకు రేణిగుంటకు చేరుకున్నారు. ఈ నిరసనలకు అనుమతించని పోలీసులు పార్టీ నేతలను ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు.

కొందరు నేతలు పోలీసుల దృష్టి మరల్చి రేణిగుంట చేరుకున్నారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించిన పోలీసులు.. అక్కడికి చేరుకుంటున్న నేతలను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్, సత్యవేడు ఇన్​చార్జ్ జేడీ రాజశేఖర్​తో పాటు పలువురు నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి గాజులమండ్యం పోలీస్ స్టేషన్​కు తరలించారు.

రేణిగుంటు విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత
Last Updated : Mar 1, 2021, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details