తిరుపతి రుయా ఆస్పత్రి విషాద ఘటనలో అధికారులు తప్పుడు లెక్కలు చూపించారని... తెదేపా నేత పీఆర్ మోహన్ తిరుపతి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. రుయా విషాద ఘటనలో 40 మంది చనిపోయినట్లు ఆధారాలున్నా.. తప్పుడు లెక్కలు చూపారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
tirupati ruia incident: 'జడ్జి గారూ.. రుయా మరణాల సంఖ్యపై దర్యాప్తు చేయించండి'
తిరుపతి రుయా ఆస్పత్రి విషాద ఘటనలో అధికారులు తప్పుడు లెక్కలు చూపించడాన్ని... తెదేపా నేత పీఆర్ మోహన్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆక్సిజన్ అందని కారణంగా జరిగిన మరణాల సంఖ్యను తగ్గించి చూపించారని... న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
'RUYA CASE IN COURT : జడ్జి గారూ.. రుణా మరణాల సంఖ్యపై దర్యాప్తు చేయించండి'
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పీఆర్ మోహన్ న్యాయస్థానాన్ని కోరారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ కోర్టులో ఆన్లైన్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు.
ఇవీ చూడండి :CM Jagan Review: భూరక్ష పథకం చురుగ్గా ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి