రాష్ట్ర ప్రభుత్వం పాలక సంఘం పరిధిలో ఆస్తి పన్ను పెంచుతూ జారీ చేసిన జీవోలు వెంటనే ఉపసంహరించుకోవాలని తెదేపా, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి పురపాలక సంఘం కార్యాలయం ఎదుట వీరు ఆందోళన తెలిపారు. వైకాపా ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. తక్షణమే పన్నులు పెంచుతూ జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఆస్తి పన్ను పెంపుపై విపక్షాల నిరసన - ఏపీ తాజా వార్తలు
ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. చిత్తూరు జిల్లాలో తెదేపా, సీపీఐ నాయకులు ఆందోళన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
tdp cpi protest