పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం కొట్టాలకు చెందిన బోడు గుట్ట అమీన్‌పీర్ (35).. శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులకు ఆదివారం సమాచారం అందింది. భర్త మరణవార్త విన్న భార్య హరిమ, వారి పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. వరుస కరవులతో వ్యవసాయ పనులు లేక, చేసిన అప్పులు తీర్చలేక భార్య పిల్లల పోషణ కోసం 11 నెలల క్రితం అమీన్ సౌదీ వెళ్ళాడు. అతని మృతదేహాన్ని తీసుకు వచ్చే స్తోమత తమకు లేదని బాధితులు ఆవేదన చెందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమీన్ మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాలని వేడుకున్నారు.
చిత్తూరు వాసి.. సౌదీలో దుర్మరణం - chitoor district
చిత్తూరు జిల్లా కొట్టాలకు చెందిన బోడు గుట్ట అమీన్ పీర్ అనే వ్యక్తి సౌదీలో శనివారం మరణించినట్లు కుటుంబీకులకు వార్త తెలిసింది. తమకు ఆర్థిక స్తోమత లేదని.. అమీన్ మృతదేహాన్ని స్వగ్రామం రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
సౌదీలో మరణించిన చిత్తూరు వాసి... బోరున విలపిస్తున్న కుటుంబీకులు