చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆనుకుని ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదికి జలకళ సంతరించుకుంది. తిరుపతి, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో నదీ ప్రవాహం కొనసాగుతోంది. ఇటీవల నదీని శుభ్రం చేయడం, కొత్తగా వ్యర్ధాల పడేయకుండా చర్యలు చేపట్టడంతో పరిసరప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. స్వర్ణముఖి నదిలో నిర్మించిన ఆనకట్ట ద్వారా నదిలో వచ్చే ప్రవాహాన్ని కాలువ నుంచి చిత్తూరు జిల్లాతోపాటు నెల్లూరు జిల్లాలోని పలు చెరువులకు నీళ్లు మళ్లించారు. ప్రస్తుతం రోజుకు వెయ్యి కోట్ల మేర నీరు ప్రవహిస్తుండగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్వర్ణముఖి..రైతుల పాలిట సిరుల సఖి
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆనుకుని ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదికి జలకళ సంతరించుకుంది. కురుస్తున్న భారీ వర్షాలకు నదీ ప్రవాహం కొనసాగుతుండగా..రైతులు చెరువులు నిండుతాయని, పంటలు పండుతాయని ఆనందిస్తున్నారు.
వర్షంపు నీటితో నిండిన స్వర్ణముఖి నది