చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో ఆడికృత్తిక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం రాత్రి కలికిరి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వార్లకు వేద మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
పీలేరులో సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం - temple
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడి కృత్తిక మహోత్సవాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. పీలేరులో స్వామివారికి కల్యాణం జరిపించారు.
కల్యాణం