తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్న ప్రైవేటు కళాశాల విద్యార్థులు మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నారు. ఇది బహిరంగంగా జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు మాత్రం మిన్నుకుండి పోతున్నారు. ఈనెల 1 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఇప్పటికీ అలాగే జరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇవి చూచిరాతలా, పరీక్ష కేంద్రాల అని నోరెళ్లబెడుతున్నారు. కళాశాల యాజమాన్యం ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి విద్యార్థులకు చెప్పడం, పరీక్ష ప్రారంభానికి ముందు ఆ ప్రశ్నలకు జవాబులను కేంద్రం వద్దే చింపుకుని వెళ్లి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌లో కాపీయింగ్ - ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులు
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రైవేటు విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేస్తున్నా... అధికారులు పట్టించుకోేలేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటన తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో చోటుచేసుకుంది.
తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులు