Students Fighting: చిత్తూరు జిల్లా పలమనేరులో మదర్ థెరిసా కళాశాలలో విద్యార్థులు రెండు గ్రూపులుగా ఏర్పడి పరస్పరం దాడులు చేసుకున్నారు. కాలేజీ సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై అందూరు చూస్తుండగానే విద్యార్థులు కొట్టుకున్నారు. పిల్లలను కాలేజీకి పంపితే ఇలా చేస్తారా అని పలువురు వీడియోలు తీసి సోషియల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా విద్యార్థులు ఇలా గ్రూపులుగా ఏర్పడి ఘర్షణలకు పాల్పడుతున్నారని స్థానికులు తెలిపారు. గతంలో కాలేజీ ఆవరణలోని దాబాలో ఇద్దరు విద్యార్థులు కూర్చొని మద్యం సేవిసున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
Students Fight: గ్రూపులుగా విడిపోయి విద్యార్థుల ఫైట్.. ఎక్కడంటే..? - students fight
Students Fighting: చదువుకుంటారని పిల్లలను తల్లిదండ్రులు కాలేజీలకు పంపితే.. విద్యార్థులు మాత్రం చదువును పక్కన పెడుతున్నారు. సినిమాల ప్రభావమో ఏమోగానీ గ్రూపులుగా ఏర్పడి.. ఫైటింగ్లు చేస్తున్నారు. పలమనేరులోని ఓ కాలేజీలో విద్యార్థులు గొడవపడ్డారు. గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడి చేసుకున్నారు.
విద్యార్థుల ఘర్షణ