ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మేము సైతం' అంటున్న స్కౌట్స్​, గైడ్స్​ విద్యార్థులు - physical distance

శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్​డౌన్ విధించింది. ఈ విపత్కర పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు తమకు తోచిన సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలో స్కౌట్స్​, గైడ్స్​ విద్యార్థులు.. ప్రజలు భౌతిక దూరం పాటించేలా అవగాహన కలిగిస్తున్నారు.

Students  are aware of physical distance in Srikalahasti
మేము సైతం అంటున్న స్కౌట్స్​, గైడ్స్​ విద్యార్థులు

By

Published : Apr 12, 2020, 4:17 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు తమ వంతు సాయం చేస్తున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​లో ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నారు. అనాథలు, వాహన చోదకులు, వైద్య, పోలీసులకు ఆహారం, తాగునీరు అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details