ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య - చిత్తూరు జిల్లా వార్తలు

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Student suicide in repentance in chithoor district
మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Apr 28, 2020, 11:22 PM IST

చిత్తూరు జిల్లా కలకడ ఇందిరమ్మ కాలనీకి చెందిన రంజిత... వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విజయవాడలో నీట్ కోర్సుకు శిక్షణ తీసుకుంటున్న రంజిత లాక్​డౌన్ కారణంగా ఇటీవల గ్రామానికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలని తల్లి అంజనాదేవి.. విధులు ముగించుకుని ఇంటికి రాగా తన కుమార్తె విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది.

ABOUT THE AUTHOR

...view details