ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళలపై దాడులు చేసే వారికి జీవించే అర్హత లేదు'

యువతిపై పెట్రోల్ పోసి హత్యకు ప్రయత్నించిన ఘటనపై.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం గుట్టకిందపల్లికి చెందిన బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

vasireddy pamda visiting petro attack victim
బాధితురాలిని పరామర్శిస్తున్న వాసిరెడ్డి పద్మ

By

Published : Dec 18, 2020, 9:10 AM IST

చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం గుట్టకిందపల్లిలో ఓ యువతిపై పెట్రోల్ పోసి హత్య చేసేందుకు యత్నించిన ఘటనపై.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశించామని తెలిపారు.

మహిళల భద్రత కోసం దిశ చట్టం దగ్గర నుంచి మహిళా పోలీసు వ్యవస్థ వరకు.. అన్నింటిపైనా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందన్నారు. అతివలపై దాడులకు పాల్పడిన వ్యక్తులకు.. జీవించే అర్హత లేదన్నారు. బాధితురాలిని కలిసి ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details